13న ఐటీఐ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు
* రెండువేలకు పైగా ఉద్యోగాల భర్తీకి చర్యలు
మారుతి సుజుకి కంపెనీలోని రెండు వేల పైచిలుకు టెక్నీషియన్ ఉద్యోగ ఖాళీల భర్తీకి నవంబర్ 13న ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ఉపాధి శిక్షణ శాఖ ప్రాంతీయ ఉప సంచాలకులు (ఆర్డీడీ) పి.నర్సయ్య తెలిపారు. ఈ మేరకు నవంబర్ 6న మల్లేపల్లి ప్రభుత్వ ఐటీఐ ప్రాంగణంలో ఉన్న ఆర్డీడీ కార్యాలయంలో బ్రోచర్ విడుదల చేసి వివరాలను వెల్లడించారు. ఐటీఐలో ఫిట్టర్, టర్నర్, మెషినిస్ట్, ఆటోమొబైల్, వెల్డర్, పెయింటర్, డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, ట్రాక్టర్ మెకానిక్, పీపీఓ ట్రేడ్లలో ఉత్తీర్ణులైన వారితోపాటు పరీక్ష రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు అర్హులన్నారు. 18 -26 సంవత్సరాల మధ్య వయస్కులైన పురుష అభ్యర్థులు మాత్రమే తగిన విద్యార్హత పత్రాలతో జాబ్ మేళాకు హాజరుకావాలన్నారు. ఎంపికైన వారికి రూ.15 వేల జీతంతోపాటు
ఈఎస్‌ఐ, పీఎఫ్, ఇతర సదుపాయాలుంటాయని వివరించారు. ఎంపికైన అభ్యర్థులు హర్యానాలోని మనేసర్, గుర్గావ్ ప్లాంట్లల్లో పనిచేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇతర వివరాలకు ఆర్డీడీ కార్యాలయంలో లేదా .08769179288,
09928711198 ఫోన్ నెంబర్లలో సంప్రదించవచ్చు.

No comments:
Post a Comment