Pages

Friday, November 7, 2014

హోంగార్డు పోస్టుకు ఏడో తరగతి కనీస విద్యార్హత

* స్థానిక అభ్యర్థులకే ఉద్యోగాలు

హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో హోంగార్డు పోస్టుకు కనీస విద్యార్హత ఏడో తరగతిగా నిర్ణయించినట్లు పోలీస్‌ అధికారులు నవంబరు 6న ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నియామకాలు కేవలం హైదరాబాద్‌ నగర పరిధిలో నివాసం ఉండే స్థానిక అభ్యర్థులకు మాత్రమేనని స్పష్టం చేశారు. ఆసక్తి ఉన్నవారు నవంబరు 22 లోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ప్రతిభ ఆధారంగా పారదర్శకంగా జరిగే నియామకాల్లో అర్హులైన వారికి ఉద్యోగాలు లభిస్తాయని, ఎలాంటి సిఫార్సులు అవసరం లేదని వివరించారు. హోంగార్డు ఉద్యోగం ఇప్పిస్తామంటూ ఎవరైనా డబ్బులు అడిగినా అలాంటి వారిని నమ్మకూడదని పేర్కొన్నారు. వారి వివరాలను 040-2785 4930, 94906 16300, 94906 16104 నంబర్లకు తెలపాలని సూచించారు.

No comments:

Post a Comment