Pages

Saturday, November 8, 2014

 



పదో తరగతి పూర్తి చేయడమనేది విద్యార్థి దశలో ఓ ముఖ్యమైన ఘట్టం. టెన్త్ తర్వాత పై చదువులు పూర్తి చేయడానికి ఆర్థిక స్తోమత లేదా ఆసక్తి లేనివారు పదో తరగతి అర్హతతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో కొన్ని రకాల ఉద్యోగాలు సంపాదించుకోవడానికి అవకాశముంది.

ఇరవై ఏళ్లు కూడా నిండకుండానే ప్రభుత్వంలోని ముఖ్యమైన విభాగాల్లో మంచి జీతంతో ఉద్యోగం పొందడం వల్ల భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు. స్థిరమైన జీవితం ఏర్పరుచుకోవడానికి చిన్న వయసులోనే తొలి అడుగులు వేయవచ్చు.
పదో తరగతి ఉత్తీర్ణులైన వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగావకాశాలను అందిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వానికి చెందిన వివిధ శాఖల్లో ఏర్పడే క్లరికల్, ఆఫీసర్ తదితర హోదా పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ చర్యలు తీసుకుంటోంది. టెన్త్, ఇంటర్, ఆపై అర్హతలకు తగినవిధంగా నియామక ప్రకటనలు జారీ చేస్తోంది. అదేవిధంగా ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్, రైల్వే మొదలైన విభాగాలు వివిధ రకాల పోస్టుల భర్తీకి ప్రకటనలు ఇస్తున్నాయి.
రాష్ట్ర స్థాయిలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగాల భర్తీ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటే, అటవీ శాఖలో ఏర్పడే ఖాళీలను ఆ శాఖ భర్తీ చేస్తోంది. వీటి గురించి తెలుసుకుందాం.

APPSC::-
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ వ్యవహారాలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) చేపడుతుంది. గ్రూప్ - IV స్థాయి ఉద్యోగాల నుంచి గ్రూప్ - I కేడర్ వరకూ నియామక ప్రక్రియను ఏపీపీఎస్సీ నిర్వహిస్తుంది. వీటిలో పదో తరగతి ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకునే అవకాశమున్న ఉద్యోగాల గురించి తెలుసుకుందాం...
గ్రూప్- IV స్థాయిలో ఏపీ జువైనెల్ వెల్ఫేర్ అండ్ కరెక్షనల్ సబ్ సర్వీసెస్‌లో సూపర్‌వైజర్లు, మ్యాట్రన్ పోస్టులు.
అర్హతలు: పదో తరగతి ఉత్తీర్ణతతోపాటు 18 నుంచి 34 సంవత్సరాల మధ్య ఉండాలి. రాత పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుంది. రాత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది. ఇంటర్వ్యూ ఉండదు.
వెబ్‌సైట్‌లు: www.apspsc.gov.in
Railway::-
రైల్వేలో రక్షణ విభాగానికి చెందిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్/ రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్‌లో కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేస్తుంటారు. ఈ ప్రక్రియను రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ పర్యవేక్షిస్తుంది. ఈ పోస్టులకు స్త్రీ. పురుషులిద్దరూ దరఖాస్తు చేయవచ్చు. 
అర్హతలు: పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి. వయసు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక:
ఆబ్జెక్టివ్ తరహాలో రాత పరీక్ష నిర్వహిస్తారు. దీన్లో అరిథ్‌మెటిక్, జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ఇంగ్లిష్, జనరల్ అవేర్‌నెస్ ఉంటాయి. ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీ భాషలతో పాటు ఆయా రాష్ట్రాలకు చెందిన ప్రాంతీయ భాషలో కూడా ఉంటుంది. దీన్లో అర్హత సాధించిన వారికి తర్వాత శారీరక సామర్థ్య పరీక్షలు నిర్వహిస్తారు.
వెబ్‌సైట్‌లు: www.indianrailways.gov.in & www.scrailway.gov.in

ITBP:-
ఇండో - టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీఎఫ్) కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి తరచూ ప్రకటనలు జారీ చేస్తుంది. ఈ పోస్టుల్లో కానిస్టేబుల్ హోదాలోనే కుక్, వాషన్‌మన్, బార్బర్, వాటర్ క్యారియర్, సఫాయి కర్మచారి తదితర హోదాలుంటాయి.
అర్హతలు: వీటికి కేవలం పురుషులు మాత్రమే అర్హులు.
పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. వయసు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక: శారీరక సామర్థ్య, రాత, వైద్య పరీక్షలు ఉంటాయి.
వెబ్‌సైట్: itbpolice.nic.in
INDIAN NAVY & ARMY,AIRFOREC::-

దేశ రక్షణకు శ్రమించే ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ విభాగాల్లో ఏటా ఉద్యోగాల భర్తీ జరుగుతుంది. పదో తరగతి, ఇంటర్ ఆపై అర్హతలున్న వారికి ఈ విభాగాల్లో వివిధ పోస్టులు అందుబాటులో ఉంటున్నాయి. వీటిలో పదో తరగతి ఆధారంగా లభించే ఉద్యోగాల వివరాలు...

ఇండియన్ ఆర్మీ:
కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇండియన్ ఆర్మీ వివిధ రకాల ఉద్యోగాల భర్తీ నిమిత్తం ప్రకటనలు జారీ చేస్తుంది. జిల్లా ప్రధాన కేంద్రాలు, పట్టణాల్లో వాక్-ఇన్/ ఇంటర్వ్యూలు కూడా నిర్వహిస్తుంది. ఆర్మీ పోస్టుల్లో ప్రధానంగా అందరికీ అందుబాటులో ఉండేవి... సోల్జర్లు (జనరల్ డ్యూటీ).
అర్హతలు: కనీసం 45 శాతం మార్కులతో పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. వయసు 17 1/2 నుంచి 21 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక: కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (సీఈఈ) నిర్వహంచి ఎంపిక చేస్తారు. దీన్లో రెండు పేపర్లు ఉంటాయి.
పేపర్-1 సోల్జర్ జనరల్ కేటగిరీలకు చెందింది.
పేపర్-2 టెక్నికల్ సోల్జర్ విభాగాలకు చెందింది.
రాత పరీక్షలో అర్హత సాధించిన వారికి శారీరక సామర్థ్య పరీక్షలు ఉంటాయి. వీటిలో అర్హత పొందినవారిని ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
వెబ్‌సైట్: www.indianarmy.nic.in
ఎయిర్‌ఫోర్స్:
భారత వాయుసేన (ఇండియన్ ఎయిర్‌ఫోర్స్) పదో తరగతి ఉత్తీర్ణులైన వారికి ఎయిర్‌మన్ (మ్యుజీషియన్) ఉద్యోగాలను కల్పిస్తోంది. ఎయిర్‌ఫోర్స్‌లో ఇది గ్రూప్ - వై ట్రేడ్‌కు చెందింది.
అర్హతలు: కనీసం 45 శాతం మార్కులతో పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. వయసు 17 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.
గిటార్, క్లారినెట్, వయోలిన్ లేదా ఇతర సంగీత వాయిద్య పరికరాల ప్రయోగం తెలిసి ఉండాలి. శారీరకప్రమాణాల్లో భాగంగా ఎత్తు 157 సెం.మీ., ఛాతీ సాధారణ స్థితిలో 80 సెం.మీ., గాలి పీల్చినప్పుడు 85 సెం.మీ. ఉండాలి.
ఎంపిక: మొదట రాత పరీక్ష తర్వాత శారీరక సామర్థ్య పరీక్ష నిర్వహిస్తారు. వీటిలో అర్హత సాధించిన వారికి వైద్య పరీక్షలు జరిపి ఎంపిక చేస్తారు.
వెబ్‌సైట్: www.indianairforce.nic.in
ఇండియన్ నేవీ:
భారత నౌకాదళం (ఇండియన్ నేవీ) పదో తరగతి ఉత్తీర్ణులైన వారికి ఉద్యోగాలను అందిస్తోంది. ఈ పోస్టులకు అవివాహిత పురుషులు మాత్రమే అర్హులు.
1) కుక్స్: పదో తరగతి ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవచ్చు. విధుల్లో భాగంగా ఆహార పదార్థాలను తయారుచేయగలగాలి.
2) స్టీవార్డ్స్: పదో తరగతి ఉత్తీర్ణులు అర్హులు. ఆఫీసర్ల మెస్‌లకు అవసరమైనప్పుడు ఆహార పదార్థాలను సరఫరా చేయాల్సి ఉంటుంది. వెయిటర్లుగా, హౌస్‌కీపింగ్, విధుల నిర్వహణ తదితర బాధ్యతలను నిర్వర్తించాల్సి ఉంటుంది. దీనికి తగిన శిక్షణ ఇస్తారు.
వయసు: అన్ని రకాల పోస్టులకు అభ్యర్థుల వయసు 17 నుంచి 21 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక: ఆబ్జెక్టివ్ విధానంలో రాత పరీక్ష నిర్వహిస్తారు. దీన్లో అర్హత సాధించిన వారికి శారీరక సామర్థ్య పరీక్షలు నిర్వహిస్తారు.
వెబ్‌సైట్: nausena-bharti.nic.in

No comments:

Post a Comment