కలల సాకారంలో కొండంత అండగా విద్యా రుణాలు
సరస్వతీ
కటాక్షం ఉన్నా లక్ష్మీ కటాక్షం ఉంటేనే చదువుకునే అవకాశం లభించడం
ఒకప్పటి సంగతి. కానీ ఇప్పుడు ఆ పరిస్థతి పూర్తిగా మారిపోయింది.
చదువుకోవడానికి ఆర్థిక నేపథ్యం అంతంత మాత్రమేనని చింతించాల్సిన
పనిలేదు. ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తించదు ఇప్పుడెలా అంటూ
ఆలోచించాల్సిన అవసరమూ లేదు. ఎందుకంటే ఇప్పుడు అన్ని బ్యాంకులూ విద్యా
రుణాలను అందిస్తున్నాయి. విద్యార్థులకు అండగా నిలుస్తున్నాయి. మిగతా
వడ్డీలతో పోలిస్తే కొంచెం తక్కువ శాతానికే, పరిమిత నిబంధనలతోనే
రుణాలను మంజూరు చేస్తున్నాయి. అవసరాన్ని బట్టి నచ్చిన బ్యాంకు నుంచి
రుణాన్ని పొందొచ్చు. అందుకే రుణాలు, వడ్డీ శాతం ఏయే బ్యాంకుల్లో ఎలా
ఉందో, ఎందులో ఎలాంటి ప్రోత్సాహకాలు ఉన్నాయో తెలుసుకుంటే మరింత ప్రయోజనం
పొందవచ్చు.కేవలం గుర్తింపు పొందిన విద్యా సంస్థలో ప్రవేశం పొందినట్లు చూపే పత్రం జతచేయడం, విద్యార్థి పూర్తి వివరాలు దరఖాస్తు ఫారంలో నింపడం, ఆపై తల్లిదండ్రులు లేదా సంరక్షకులతో సంతకాలు ఇవుంటే చాలు విద్యారుణం సులువుగానే పొందొచ్చు. రూ.4 లక్షల లోపు రుణాలకైతే మీకున్న పరపత, స్తోమతతో సంబంధం లేకుండానే ఇంచుమించు అన్ని బ్యాంకులూ విద్యా రుణాలు మంజూరు చేస్తున్నాయి. కేవలం కోర్సు ఫీజుకే కాకుండా వసతి, భోజన ఖర్చులు, పాఠ్యపుస్తకాలు, యూనిఫారం, లైబ్రరీ, ల్యాబ్, పరికరాలు, కంప్యూటర్...ఇలా వివిధ ఖర్చుల మొత్తానికి కూడా రుణాన్ని పొందే వీలుంది. వీటితోపాటు ఒక్కో బ్యాంకులో ఒక్కో వర్గానికి ప్రత్యేక బెనిఫిట్లు కూడా లభిస్తున్నాయి. కొన్ని బ్యాంకులు టాపర్స్‌కి వడ్డీలో రాయితీలు అందిస్తున్నాయి. మరికొన్ని ప్రతిష్ఠాత్మక సంస్థల్లో చేరినవారికి కొంత తక్కవ శాతం వడ్డీకి లోన్ మంజూరు చేస్తున్నాయి. అలాగే సింహభాగం కంపెనీలు మహిళలకు వార్షిక వడ్డీలో 0.5 శాతం రాయితీని అందిస్తున్నాయి. ఎస్సీ, ఎస్టీలకు కూడా రాయితీ ఇచ్చే బ్యాంకులున్నాయి. అలాగే గడువులోగా ఎలాంటి అవరోధాలు లేకుండా తీసుకున్న మొత్తాన్ని చెల్లిస్తే 1 శాతం వడ్డీని తిరిగి అందుకోవచ్చు. బ్యాంకును బట్టి తీసుకున్న మొత్తాన్ని మారటోరియం పీరియడ్ (కోర్సు పూర్తయిన ఏడాది తర్వాత) అనంతరం ఐదేళ్ల నుంచి గరిష్ఠంగా 15 ఏళ్లలోగా తిరిగి చెల్లించాలి. అందుకే మీ ప్రొఫైల్‌కు ఏ బ్యాంకులో తక్కువ వడ్డీకి రుణం లభిస్తుందో తెలుసుకోవడం ముఖ్యం. మీరుండే ప్రాంతానికి సమీపంలో ఉన్న బ్రాంచ్‌ని సందర్శించి పూర్తి వివరాలలు తెలుసుకోవడంతోపాటు లోన్ పొందడం కూడా సులువే. ఎడ్యుకేషన్ లోన్లు కేవలం భారత్‌లోనే చదువుకునే విద్యార్థులకోసమే కాకుండా విదేశాల్లో చదవాలనుకునేవాళ్లకు సైతం ఇస్తున్నారు. ఎస్‌బీఐలో అయితే ద్విచక్ర వాహనం కోసం కూడా గరిష్ఠంగా రూ.50,000 వరకు ఎడ్యుకేషన్‌లోన్‌లో భాగంగా పొందొచ్చు. బ్యాంకుల వారీ రుణాలు, వడ్డీల వివరాలు ఇలా ఉన్నాయి...
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాభారత్లో చదువుకోవడానికైతే గరిష్ఠంగా రూ. పది లక్షలు, విదేశాల్లో చదువుకోవడానికి రూ.20 లక్షలు లోన్ మంజూరుచేస్తున్నారు.
రూ.4 లక్షల వరకు తీసుకున్న రుణానికి బేస్ రేటుపై 3.50 శాతం వడ్డీని వసూలు చేస్తారు.
రూ. 4 లక్షలకు పైబడి రూ.7.5 లక్షలలోపైతే బేస్ రేటుపై 3.75 శాతం వడ్డీ వసూలు చేస్తారు.
రూ.7.5 లక్షల కంటే ఎక్కువ మొత్తానికి బేస్ రేటుపై 1.75 శాతం వడ్డీ విధిస్తారు.
ఎంత మొత్తంలో రుణం తీసుకున్నప్పటికీ మహిళలకైతే 0.5 శాతం వడ్డీ రాయితీ ఉంటుంది.
Website:
ఆంధ్రాబ్యాంక్రూ.4 లక్షల వరకు మార్జిన్ సెక్యూరిటీ అవసరం లేదు. అమ్మాయిలకు వార్షిక వడ్డీలో 0.5 శాతం కన్సెషన్‌ను ఇస్తుంది. అలాగే మెరిట్ విద్యార్థులకు (అకడమిక్, ఎంట్రన్స్ పరీక్షల్లో ప్రతిభ ఆధారంగా) వడ్డీలో కొంత రాయితీని అందిస్తుంది. అలాగే ప్రఖ్యాత సంస్థల్లో చేరిన వారికి పెద్ద మొత్తంలో రుణాలివ్వడంతోపాటు వడ్డీలోనూ ఆంధ్రాబ్యాంక్‌రాయితీ ఇస్తుంది.
రూ.7.5 లక్షల వరకు రుణానికి: బేస్ రేటు+2.75 శాతం వడ్డీ అంటే ప్రస్తుతం ఇది 13 శాతం.
రూ. 7.5 లక్షల కంటే ఎక్కువ మొత్తానికి: బేస్ రేటు + 1.5 శాతం. అంటే ప్రస్తుతం ఇది 11.75 శాతం.
Website:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్నాలుగు లక్షల రూపాయల వరకు: ఏడాదికి 12.70 శాతం
నాలుగు లక్షల రూపాయల కంటే ఎక్కువైతే: ఏడాదికి 13.20 శాతం వడ్డీని వసూలు చేస్తోంది.
Website:
బ్యాంక్ ఆఫ్ బరోడారూ. 7.5 లక్షల వరకు: బేస్ రేటు+ 2.5 శాతం మొత్తాన్ని ఏడాదికి వడ్డీ చెల్లించాలి.
రూ. 7. 5 లక్షల కంటే ఎక్కువ మొత్తానికి: బేస్ రేటు + 1.75 శాతం వార్షిక వడ్డీ చెల్లించాలి.
వొకేషనల్ కోర్సులు, శిక్షణలో చేరినవారికైతే: బేస్ రేటు + 2 శాతం వార్షిక వడ్డీ చెల్లించాలి.
విద్యార్థినులకు .5 శాతం వడ్డీ రాయితీ లభిస్తుంది. అలాగే ఐఐటీలు, ఐఐఎంలు, ఎన్ఐటీలు, నిఫ్ట్, ఎయిమ్స్, ఐఎస్‌బీ లాంటి ప్రఖ్యాత సంస్థల్లో చేరినవారికి వార్షిక వడ్డీలో 1 శాతం రాయితీ లభిస్తుంది.
Website:
పంజాబ్ నేషనల్ బ్యాంక్భారత్లో చదువుకోవడానికి గరిష్ఠంగా రూ. పది లక్షలు, విదేశాల్లో చదువుకోవడానికైతే రూ. 20 లక్షలు ఎడ్యుకేషన్ లోన్ పీఎన్‌బీ మంజూరు చేస్తుంది. రూ.4 లక్షల వరకు ఎలాంటి మార్జిన్ తీసుకోరు. అలాగే సెక్యూరిటీ అవసరం లేదు.
రూ. 4 లక్షల వరకు రుణానికి: బేస్ రేటు+3 శాతం వడ్డీ వసూలు చేస్తోంది. అంటే ఇది 13.25 శాతం
రూ. 4 లక్షలకు పైబడి రూ. 7.5 లక్షల లోపైతే: బేస్ రేటు + 4 శాతం అంటే 14.25 శాతం
రూ.7.5 లక్షల కంటే ఎక్కువ మొత్తానికి: బేస్ రేటు + 2 శాతం అంటే ఇది 12.25 శాతం
Website:
యాక్సిస్ బ్యాంక్అబ్బాయిలకైతే
నాలుగు లక్షల రూపాయల వరకు: బేస్ రేటు+ 7 శాతం
ప్రస్తుతం బేస్ రేటు 10.25 శాతంగా ఉంది. అంటే 17.25 శాతం వడ్డీని వసూలు చేస్తారన్నమాట.
నాలుగు లక్షల నుంచి 7.5 లక్షల రూపాయలవరకు: ఇప్పుడున్న బేస్ రేటు + 8 శాతం అంటే 18.25 శాతం
రూ.7.5 లక్షల కంటే ఎక్కువ మొత్తానికి బేస్ రేటు + 6 శాతం అంటే 16.25 శాతం
అమ్మాయిలకైతే
రూ.నాలుగు లక్షల వరకు బేస్ రేటు + 6.5 శాతం అంటే 16.75 శాతం
రూ. నాలుగు లక్షల నుంచి 7.5 లక్షల వరకు: బేస్ రేటు + 7.5 శాతం అంటే 17.75 శాతం
రూ. 7.5 లక్షల కంటే ఎక్కువ మొత్తానికి: బేస్ రేటు + 5.5 శాతం అంటే 15.75 శాతం
(ప్రస్తుత బేస్ రేటు 10.25 శాతం)
ప్రాసెసింగ్, ప్రి పేమెంట్ చార్జీలు చెల్లించాల్సిన పనిలేదు.
Website:
ఇండియన్ బ్యాంక్ఈ బ్యాంకు ద్వారా భారత్‌లో చదువుకునే విద్యార్థులకైతే రూ. పది లక్షల వరకు, ఒకవేళ విదేశాల్లో చదవాలనుకుంటే రూ. 20 లక్షల వరకు రుణాన్ని మంజూరు చేస్తారు.
వడ్డీ రేటు: ఏడాదికి 12.5 శాతం (అమ్మాయిలైతే 12 శాతం)
Website:
కార్పొరేషన్ బ్యాంకుఈ బ్యాంకు భారత్‌లో చదువుకోవడానికి గరిష్ఠంగా రూ. 10 లక్షలు, అదే విదేశాల్లోనైతే గరిష్ఠంగా రూ.20 లక్షలు రుణాన్ని మంజూరుచేస్తుంది.
నాలుగు లక్షల వరకు ఎలాంటి మార్జిన్ వసూలు చేయడం లేదు. అంతకంటే ఎక్కువ మొత్తానికి మాత్రం భారత్‌లో చదివేవారికైతే 5 శాతం, విదేశాల్లో చదువుకోవడానికైతే 15 శాతం వర్తిస్తుంది. రూ.4 లక్షల వరకు రుణాలపై ఎలాంటి హామీ అవసరం లేదు. భారత్‌లో చదువుకోవడానికైతే ఎలాంటి ప్రాసెసింగ్, ప్రీ పేమెంట్ చార్జీలు విధించరు. వడ్డీ రేటు బేస్ రేటుపై ఆధారపడి ఉంటుంది. దీనికోసం సమీపంలోని కార్పొరేషన్ బ్యాంకు బ్రాంచ్‌ని సంప్రదించాలి.
Website:
సిండికేట్ బ్యాంకుఈ బ్యాంకు కూడా భారత్‌లో చదువుకోవడానికైతే గరిష్ఠంగా రూ. 10 లక్షలు, విదేశాల్లో చదువుకోసమైతే రూ. 20 లక్షల రుణాన్ని మంజూరుచేస్తుంది. నాలుగు లక్షల వరకు ఎలాంటి మార్జిన్ వసూలు చేయడం లేదు. అంతకంటే ఎక్కువ మొత్తానికి మాత్రం భారత్‌లో చదివేవారికైతే 5 శాతం, విదేశాల్లో చదువుకోవడానికైతే 15 శాతం వర్తిస్తుంది.
రూ. 4 లక్షల వరకు రుణానికి 11.75 శాతం వార్షిక వడ్డీ వసూలు చేస్తారు.
రూ. 4 లక్షలకు పైబడిన మొత్తానికి 12.25 శాతం వడ్డీ వసూలు చేస్తారు.
మహిళలు, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు .5 శాతం వడ్డీలో రాయితీ లభిస్తుంది. అదే ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన విద్యార్థినులైతే ఈ రాయితీ .75 శాతం.
తీసుకున్న మొత్తాన్ని కోర్సు పూర్తయిన ఏడాది తర్వాత మొదలుపెట్టి ఐదేళ్ల నుంచి ఏడేళ్లలోగా ఈఎంఐ విధానంలో చెల్లించాలి.
Website:
అలహాబాద్ బ్యాంకుఈ బ్యాంకు కూడా గరిష్ఠంగా రూ.20 లక్షల వరకు రుణాలను మంజూరు చేస్తుంది. రూ.4 లక్షల వరకు మార్జిన్ విధించడం లేదు. అయితే వడ్డీ రేట్లు మాత్రం అభ్యర్థి చేరే సంస్థను బట్టి మారుతాయి. ప్రఖ్యాత సంస్థల్లో చేరినవాళ్లకు తక్కువ వడ్డీ ఉంటుంది. అంతగా ప్రాధాన్యం లేని సంస్థల్లో వడ్డీరేటు ఎక్కువగా ఉంటుంది.
Website:
ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్మిగిలిన బ్యాంకుల మాదిరిగానే ఈ బ్యాంకు కూడా భారత్‌లో చదువుకునేవాళ్లకైతే రూ.10 లక్షలు, విదేశాల్లో చదివేవాళ్లకైతే రూ.20 లక్షల వరకు గరిష్ఠ రుణాన్ని మంజూరు చేస్తుంది. రూ. 4 లక్షల వరకు ఎలాంటి మార్జిన్ లేదు. ఆపైన రుణానికి భారత్‌లో చదివేవాళ్లకు 5 శాతం, విదేశాల్లో చదివేవాళ్లకు 15 శాతం మార్జిన్ విధిస్తుంది. రూ. 4 లక్షల వరకు తీసుకున్న రుణంపై ఎలాంటి ప్రాసెస్ ఫీ వసూలు చేయరు.
రూ. 4 లక్షల వరకు తీసుకున్న రుణాలపై 12.75 శాతం వడ్డీ వసూలు చేస్తారు.
రూ. 4 లక్షలకు పైబడి రుణాలకు 12 శాతం వడ్డీ వసూలు చేస్తారు.
Website:
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాభారత్లో చదివే విద్యార్థులకు రూ.10 లక్షలు, విదేశాల్లో చదివేవాళ్లకైతే రూ.20 లక్షలు గరిష్ఠంగా విద్యారుణం మంజూరు చేస్తున్నారు. రూ.4 లక్షల వరకు మార్జిన్ విధించడం లేదు. అంతకంటే ఎక్కువ మొత్తానికి భారత్‌లో చదివితే 5 శాతం, విదేశాల్లో చదివితే 15 శాతం మార్జిన్ విధిస్తున్నారు. రూ.7.5 లక్షల లోపు తీసుకున్న రుణానికి మారటోరియం పీరియడ్ తర్వాత పదేళ్లలోగా అంతకంటే ఎక్కువ మొత్తమైతే మారటోరియం పీరియడ్ తర్వాత పదిహేనేళ్లలోగా తీసుకున్న మొత్తాన్ని చెల్లించాలి.
రూ.7.5 లక్షల లోపు రుణానికి 12.5 శాతం వడ్డీ వసూలు చేస్తారు.
రూ.7.5 లక్షల పైబడిన రుణానికి 12.25 శాతం వార్షిక వడ్డీ వసూలు చేస్తారు.
మహిళలకైతే వార్షిక వడ్డీలో 0.5 శాతం తగ్గిస్తారు.
Website:
మరికొన్ని విశేషాలు...
సెక్షన్ 80 ఇ ప్రకారం ఎడ్యుకేషన్ లోన్‌పై చెల్లించే వడ్డీ మొత్తానికి అది చెల్లించినవారికి ఇన్‌కం ట్యాక్స్ నుంచి మినహాయింపు లభిస్తుంది.
ఒకవేళ ప్రమాద వశాత్తూ ఏదైనా జరగితే పరిస్థితి అంతా తారుమారు అవుతుంది. అందుకే ఇప్పుడు కొద్ది మొత్తం చెల్లించి లోన్ మొత్తానికి ఇన్పూరెన్స్ వర్తించేలా కూడా చూసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల రుణం తీసుకున్నవాళ్లకే ప్రయోజనం ఉంటుంది.
సాధారణంగా రుణం తీసుకున్న మొత్తాన్ని కోర్సు పూర్తయిన ఏడాది తర్వాత నుంచి చెల్లించాలి. లేదా ఉద్యోగం వచ్చిన సందర్భంలో కోర్సు పూర్తయిన ఆరు నెలల తర్వాత నుంచి రుణం చెల్లించడం మొదలవుతుంది.
సాధారణంగా కొన్ని బ్యాంకుల్లో రూ.4 లక్షల వరకు తీసుకున్న రుణం మొత్తానికి ఎలాంటి సెక్యూరిటీ అవసరం లేదు. మరికొన్ని బ్యాంకుల్లో రూ.7.5 లక్షల వరకు సెక్యూరిటీ అవసరం లేదు. అయితే ఇంతకంటే ఎక్కువ మొత్తానికి ఏదో ఒక హామీ చూపాల్సి ఉంటుంది.
ఎక్కువ బ్యాంకులు మహిళల చదువుకోసం ఇచ్చే రుణాల్లో అబ్బాయిలతో పోలిస్తే 0.5 శాతం వార్షిక రుణాన్ని తగ్గిస్తున్నాయి.
ఇంచుమించుగా అన్ని బ్యాంకులూ రూ. నాలుగు లక్షల వరకు ఎలాంటి మార్జిన్‌ను వసూలు చేయడం లేదు.
చాలా బ్యాంకులు భారత్‌లో చదువుకోవడానికి రూ.4 లక్షల కంటే పైబడిన మొత్తానికి 5 శాతం, విదేశాల్లో చదువుకోవడానికైతే 15 శాతం మార్జిన్ వసూలు చేస్తున్నాయి.
ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏ సంస్థలోనైనా డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ, మెడిసిన్, ఒకేషనల్, డిప్లొమా...ఇలా ఏ కోర్సులో చేరినప్పటికీ లోన్‌కి అర్హత లభిస్తుంది. అకడమిక్ పరీక్షల్లో పొందిన మార్కులు, ప్రవేశ పరీక్షల్లో పొందిన ర్యాంకులతో లోన్‌కి సంబంధం లేదు.
చాలా బ్యాంకులు బేస్ రేటుపై ఇంత అంటూ వడ్డీ వసూలు చేస్తున్నాయి. అంటే బేస్ రేటు మారితే వడ్డీలోనూ వ్యత్యాసాలు ఉంటాయి. ఒకవేళ బేస్ రేటు తగ్గితే వడ్డీ తగ్గుతుంది. బేస్ రేటు పెరిగితే వడ్డీ పెరుగుతుంది. బేస్ రేటులో మార్పులు ఆర్‌బీఐ చేస్తుంది.
No comments:
Post a Comment