సీఐఎస్ఎఫ్‌లో 176 ఖాళీలు
సెంట్రల్
ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) స్పోర్ట్స్ కోటాలో అసిస్టెంట్
సబ్-ఇన్‌స్పెక్టర్, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.........
అసిస్టెంట్- సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎగ్జిక్యూటివ్)పోస్టుల సంఖ్య: 79విభాగాలు: అథ్లెటిక్స్, బాక్సింగ్, జుడో, స్విమ్మింగ్, వెయిట్ లిఫ్టింగ్, రెజ్లింగ్, జిమ్మాస్టిక్స్, బాస్కెట్‌బాల్, ఫుట్‌బాల్, హ్యాండ్‌బాల్, కబడ్డీ, వాలీబాల్.అర్హతలు: ఏదైనా డిగ్రీ ఉండాలి. సీనియర్/ జూనియర్ లెవెల్ అంతర్జాతీ పోటీల్లో దేశం తరఫున పాల్గొనాలి లేదా జాతీయ క్రీడలు/ చాంఫియన్‌షిప్‌లో ఏదైనా పతకం సాధించాలి.వయసు: 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.శారీరక ప్రమాణాలు: పురుషుల ఎత్తు 170 సెం.మీ., చాతీ 80 నుంచి 85 సెం.మీ. ఉండాలి. మహిళల ఎత్తు 157 సెం.మీ. ఉండాలి.కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ)
పోస్టుల సంఖ్య: 97
విభాగాలు: అథ్లెటిక్స్, బాక్సింగ్, జుడో, స్విమ్మింగ్, వెయిట్ లిఫ్టింగ్, రెజ్లింగ్, జిమ్మాస్టిక్స్, బాస్కెట్‌బాల్, ఫుట్‌బాల్, హ్యాండ్‌బాల్, కబడ్డీ, వాలీబాల్.
అర్హతలు: ఇంటర్ లేదా తత్సమాన అర్హత ఉండాలి. సీనియర్/ జూనియర్ లెవెల్ జాతీయస్థాయి పోటీల్లో పాల్గొనాలి లేదా ఇంటర్ యూనివర్సిటీ/ నేషనల్ స్కూల్ గేమ్స్‌లో బంగారు పతకాన్ని సాధించాలి.
వయసు: 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి.
శారీరక ప్రమాణాలు: పురుషుల ఎత్తు 167 సెం.మీ., చాతీ 81 నుంచి 86 సెం.మీ. ఉండాలి. మహిళల ఎత్తు 154 సెం.మీ. ఉండాలి.
ఎంపిక: రెండేళ్ల క్రీడా ప్రతిభ, ఈవెంట్స్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ద్వారా.
దరఖాస్తు: వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసిన దరఖాస్తులను పూర్తిచేసి సంబంధిత విభాగాలో డీఐజీ కార్యాలయానికి పంపాలి.
చివరితేది: జనవరి 22
No comments:
Post a Comment