Pages

Thursday, December 11, 2014

పంచాయతీ కార్యదర్శుల భర్తీకి పదిరోజుల్లో ప్రకటన

ఆంధ్రప్రదేశ్‌లో 2,600 పంచాయతీ కార్యదర్శుల ఉద్యోగాల భర్తీకి పది రోజుల్లో ప్రకటన విడుదల కానుందని పంచాయతీరాజ్‌, గ్రామీణ నీటిసరఫరా శాఖల మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. డిసెంబరు 10న విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... జిల్లాల వారీగా అభ్యర్థులకు పరీక్షలు నిర్వహిస్తారని చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3600 పంచాయతీ కార్యదర్శుల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని వివరించారు. ఉమ్మడి రాష్ట్రంలో చివరిసారిగా 2677 పంచాయతీ కార్యదర్శుల పోస్టులను భర్తీ చేశారు. ఈ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) గతేడాది డిసెంబరు 30న ప్రకటన జారీ చేసి, ఈ ఏడాది ఫిబ్రవరి 23న రాతపరీక్షను నిర్వహించింది.

No comments:

Post a Comment