Pages

Monday, November 17, 2014

 సింగరేణిలో ఉద్యోగాల‌ భర్తీకి నోటిఫికేషన్!
* మొద‌టి ద‌శ‌లో 175 ఎస్టీ ఉద్యోగాల భ‌ర్తీ

సింగరేణిలో 175 ఎస్టీ పోస్టుల భర్తీకి సింగరేణి యాజమాన్యం న‌వంబ‌రు 14న‌ నోటిఫికేషన్ విడుద‌ల చేసింది. ఇటీవల సీఎం కేసీఆర్ సింగరేణిపై అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సంద‌ర్భంగా సింగరేణిలో ఖాళీగా ఉన్న పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని అధికారుల‌ను ఆదేశించారు. ఈ మేర‌కు సింగరేణిలో 175 (ఎస్టీ) బద్లీ వర్కర్ల భ‌ర్తీకి ప్రత్యేక‌ నోటిఫికేషన్‌ను అధికారులు విడుద‌లచేశారు. షెడ్యూల్డ్ ప్రాంత గిరిజనులు మాత్రమే న‌వంబ‌రు 25లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలి. పదోతరగతి విద్యార్హత కలిగి 40 ఏళ్లలోపు వయసుండాలి. త్వరలో మరో 490 ఎస్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసే అవ‌కాశం ఉంది.

  

No comments:

Post a Comment