Pages

Thursday, November 13, 2014

హైద్రాబాద్ మెట్రోలో ఉద్యోగాల జాతర..!

* 2750 పోస్టుల భర్తీకి ఎల్‌అండ్‌టీ సన్నాహాలు
* ఆన్‌లైన్‌లో దరఖాస్తులకు ఆహ్వానం
* త్వరలో మరో 20వేల ఉద్యోగాలు
* మెట్రో ఎండీ వీబీ గాడ్గిల్


ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హైద్రాబాద్ మెట్రో మొదటి దశ పనులు త్వరలో పూర్తి కానున్నాయి. వచ్చే ఏడాది మార్చి 21 నుంచి నాగోల్ నాగోలు - మెట్టుగూడ మార్గంలో మొదటి విడతగా మెట్రో రైలు నడవనుంది. ఈ మేరకు ఆర్థిక కార్యకలాపాలకు ముహూర్తం సమీపిస్తుండటంతో ఎల్‌అండ్‌టీ వర్గాలు ఉద్యోగ నియామకాలపై దృష్టి సారించాయి.  ఈ మార్గంలో రైళ్లు నడిపించేందుకు మానవవనరులు కావాల్సి ఉండటంతో ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రాజెక్ట్ నిర్వహణకు నిపుణులు, ఉద్యోగులను భర్తీ చేసేందుకు చకచక ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రాజెక్ట్ కోసం మొదటగా 2750 మంది ఉద్యోగులను తీసుకోనున్నట్లు ఎల్‌అండ్‌టీ వర్గాలు చెబుతున్నాయి. ఇందు కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. కిలోస్ ఇంజినీరింగ్ కన్సల్‌టెన్సీ వీటిని భర్తీ చేయనున్నట్లు వెల్లడించాయి. వీరే కాకుండా మరో 20 వేల మందిని ఎల్‌అండ్‌టీ అధికారికంగా రిక్రూట్ చేసుకోనున్నట్లు ఆ సంస్థ ఎండీ వీబీ గాడ్గిల్ తెలిపారు. మెట్రోరైలు ప్రాజెక్ట్‌లో తాజా రిక్రూట్‌మెంట్‌ను కిలోస్ ఇంజినీరింగ్ కన్సల్‌టెన్సీ చేపట్టనుంది. ప్రాజెక్ట్ ఆపరేషన్స్ అండ్ మేయింటెనెన్స్ కోసం కిలోస్ సంస్థను ఎల్‌అండ్‌టీ కన్సల్‌టెంట్‌గా నియమించుకుంది. ఈ సంస్థ ప్రాజెక్ట్ నిర్వహణ, కార్యకాలపాల్లో భాగస్వామ్యం కానుంది. ఫ్రెంచ్‌కు చెందిన ఈ కంపెనీయే తాజాగా నియామక ప్రక్రియను చేపట్టింది. నియామకాలు పొందిన వారందరూ ట్రైనీలుగా శిక్షణ పొందాల్సి ఉంటుంది. కిలోస్ కాంట్రాక్ట్ గడువు ముగిసిన తర్వాత.. రిక్రూట్ చేసి, శిక్షణనిచ్చిన వీరందనికి తిరిగి ఎల్‌అండ్‌టీకే అప్పగించాలి. వీరే కాకుండా మరో 20 వేలమంది ఉద్యోగులను తీసుకోవాలని ప్రాజెక్ట్ కాంట్రాక్టర్ ఎల్‌అండ్‌టీ ఆలోచిస్తోంది. 72 కిలోమీటర్ల ప్రాజెక్ట్ మొత్తానికి ఇంతే మొత్తంలో ఉద్యోగులు అవసరమవుతారని ఎల్‌అండ్‌టీ వర్గాలు భావిస్తున్నాయి. వీటి భర్తీని ఎల్‌అండ్‌టీయే చేపట్టనుంది. స్టేషన్లలో వివిధ అవసరాల కోసం వినియెగించే అవసరముంది.
భర్తీ చేసే ఉద్యోగాలు ఇవే..ఉద్యోగాలు: స్టోర్ ఆఫీసర్, ఎక్సెస్ ఫేయిర్ ఆఫీసర్, మెథడ్స్ అండ్ సైప్లె చైన్ మేనేజర్, చీఫ్ క్యూహెచ్‌ఎస్‌ఈ ఆఫీసర్, ట్రాక్ అండ్ బిల్డింగ్ మేనేజర్, అసోసియేట్ మేనేజన్, అసొసియేట్. విభాగాలు: స్టోర్ కీపింగ్, స్టోర్ ఇన్‌చార్జి, స్టోర్ సూవర్‌వైజర్, కస్టమర్‌కేర్, ఫేయిర్ రికవరీ, ప్యాసింజర్స్ టికెట్ ఇష్యూయింగ్, సప్లయ్ చైన్ మేనేజ్‌మెంట్, క్వాలిటీ, ఈహెచ్‌ఎస్, ఇంటిగ్రేటెడ్ మేనేజ్‌మెంట్, రైల్వే మెట్రో ట్రాక్ నిర్వహణ, ప్లానింగ్ అండ్ కంట్రోల్,  మెట్రోరైలు బోగీల నిర్వహణ (రోలింగ్ స్టాక్).
 

 

No comments:

Post a Comment