Pages

Thursday, November 13, 2014

వేద పండితుల నుండి దరఖాస్తుల ఆహ్వానం

 తితిదే ఆధ్వర్యంలో శ్రీ వేంకటేశ్వర ఉన్నత వేదాధ్యయన సంస్థ అమలు చేస్తున్న వేదపారాయణ పథకంలో సంభావన ప్రాతిపదికన 'వేదపారాయణదారు' ఉద్యోగాలకు దేశవ్యాప్తంగా వేద పండితుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. వేదపారాయణ పథకంలో మొత్తం 83 ఖాళీలున్నాయి. అభ్యర్థులు రుగ్వేదం, కృష్ణయజుర్వేదం, శుక్ల యజుర్వేదంలలో ఏదేని ఒకదానితో పాటు సామవేదంలో రహస్యాంతం, అధర్వణవేదంలో సంహిత అంశాల్లో క్రమాంత అర్హతను కలిగి ఉండాలి. తిరుమల తిరుపతి దేవస్థానం, దేవాదాయశాఖ గుర్తింపు పొందిన మఠాలు జారీ చేసిన ధ్రువీకరణపత్రాలను అనుమతిస్తారు. అభ్యర్థుల వయసు 18 ఏళ్లు పైబడి, వస్త్రధారణ, రూపం సంప్రదాయబద్ధంగా ఉండాలి. ఘనాపాఠీలకు నెలకు రూ.17,158 ; క్రమాపాఠీలకు నెలకు రూ.16,158 సంభావన చెల్లిస్తారు. ఎంపికైన వేదపారాయణదారులు 6(బి), 6(సి) ఆలయాలు, మఠాలు, వేదపాఠశాలల్లో వేదపారాయణం చేయాల్సి ఉంటుంది. పూర్తి చేసిన దరఖాస్తులను నవంబరు 24వ తేదీలోగా 'ప్రాజెక్టు అధికారి, శ్రీవేంకటేశ్వర ఉన్నత వేదాధ్యయన సంస్థ, శ్వేత భవనం, తితిదే, తిరుపతి-517501 అనే చిరునామాకు పంపాల్సి ఉంటుంది. దరఖాస్తుతో పాటు మూడు పాస్‌పోర్టు సైజు ఫొటోలు, వయసు, విద్యార్హతలకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాల జిరాక్స్ కాపీలను గెజిటెడ్ అధికారితో అటెస్టు చేయించి పంపాల్సి ఉంటుంది. ఇతర వివరాలకు 0877-2264571 నవంబరులో కార్యాలయ వేళల్లో శ్రీవేంకటేశ్వర ఉన్నత వేదాధ్యయన సంస్థను సంప్రదించవచ్చు.
 

No comments:

Post a Comment